తెలంగాణ శాసనసభ మంగళవారానికి వాయిదా పడింది. రేపు ఉదయం 11 గంటలకు ఉభయ సభలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఉభయసభల్లో ఇటీవల మృతి చెందిన మాజీ రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ, టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతిపట్ల సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. శాసనసభలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఈ రెండు సంతాప తీర్మానాలను సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించి.. నివాళులర్పించారు. మాజీ సభ్యులు కావేటి సమ్మయ్య, జువ్వాడి రత్నాకర్ రావు, పోచయ్య, పి రామస్వామి, మస్కు నర్సింహ, బి కృష్ణ, సున్నం రాజయ్య, ఎడ్మ కిష్టారెడ్డి, మాతంగి నర్సయ్య మృతి పట్ల సభ నివాళులర్పిస్తూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించింది. అనంతరం సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.
