రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు అపూర్వ స్పందన లభిస్తున్నది. మొక్కలు నాటేందుకు పలువురు ప్రముఖులు ముందుకొస్తున్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఏ శరత్ విసిరిన ఛాలెంజ్ ను వరంగల్ అర్బన్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు స్వీకరించారు. తన క్యాంపు కార్యాలయంలో మొక్కను నాటారు. అనంతరం ఈ ఛాలెంజ్ ని మరో ముగ్గురైన 1.కృష్ణ ఆదిత్య కలెక్టర్ ములుగు, 2. వీపీ గౌతమ్ కలెక్టర్ మహబూబాబాద్ , 3. ఎండీ అక్బర్ సీఎఫ్ వో వరంగల్ ను జిల్లా కలెక్టర్ నామినేట్ చేస్తూ గ్రీన్ ఛాలెంజ్ విసిరారు.
