భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. సువిశాలమైన భారతదేశంలో 135 కోట్ల జనాభా ఉన్నది. ప్రజాస్వామిక వ్యవస్థ ఉన్నది. ప్రధానిగా సేవలందించే అవకాశం కొద్ది మందికే ఉంటుంది. ఈ పదవి చాలా అరుదుగా దక్కుతుంది. అలాంటి పదవి తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావుకు దక్కింది. పీవీ శతజయంతి ఉత్సవాలు సందర్భంగా.. కేంద్ర ప్రభుత్వాన్ని భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తీర్మానం ప్రవేశపెడుతున్నాం. పీవీ బహుముఖ ప్రజ్ఞశాలి, బహుభాషా కోవిదుడు. నూతన ఆర్థిక సంస్కరణలు చేపట్టారు.
