ఏపీలో కొత్తగా 10,601 కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్నది. గడచిన 24 గంటల్లో కొత్తగా 10,601 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఒక్కరోజు వ్యవధిలోనే 73 మంది ప్రాణాలు కోల్పోయారు.  దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 5,17,094కు చేరింది. ప్రస్తుతం 96,769 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటి వరకు 4,15,765 మంది కోలుకున్నారు. కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 4,560కు చేరింది. 24 గంటల్లో 11,691 మంది కొవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇవాళ్టి వరకు 42,37,070 శాంపిల్స్‌ను పరీక్షించారు.