రాష్ట్రంలోని వీఆర్‌వోలకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ర్టంలో అనివార్య పరిస్థితుల్లోనే వీఆర్‌వో వ్యవస్థను రద్దు చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. వీఆర్‌వోలను వివిధ శాఖల్లో సర్దుబాటు చేస్తామని ప్రకటించారు. 5485 మంది వీఆర్‌వోలు వర్కింగ్‌లో ఉన్నారు. వీరందరికి ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నారు. వీఆర్‌వోల ఉద్యోగాలు ఎక్కడికి పోవు. రాబోయే రోజుల్లో వారికి ఆప్షన్లు ఇస్తామన్నారు. తాసీల్దార్లు, ఆర్డీవోలు అలాగే ఉంటారు. భూ వివాదాలపై తాసీల్దార్లు, ఆర్డీవో, జేసీలు ఆర్డర్లు ఇస్తారని పేర్కొన్నారు. ఆర్డర్లు ఇచ్చిన రెవెన్యూ అధికారుల వద్దే కోర్టులు ఉన్నాయి. ఇక నుంచి రెవెన్యూ కోర్టులు ఉండవు అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
