వరంగల్‌ భద్రకాళీ దేవస్థానానికి ఐఎస్‌వో కమిటీ

వరంగల్‌ నగరంలోని చారిత్రక భద్రకాళీ దేవాలయానికి ఐఎస్‌వో సర్టిఫి కేషన్‌ నిమిత్తం సంస్థ సిబ్బంది గురువారం ఆల యాన్ని పర్యవేక్షించారు. అర్చకుల నియమ నిబం ధనలు, సిబ్బంది విధి నిర్వహణ, శానిటైజేషన్‌కు సంబంధించి దేవాలయ పరిసర ప్రాంతాలను పరి శీలించారు. దేవాలయంలో ప్రసాదాల తయారీ, నాణ్యత, అన్నదాన సత్రంలో పరిశుభ్రత తదితర అంశాలతో కూడిన రిపోర్టును పంపించనున్నట్లు పేర్కొన్నారు. వారి సిఫార్సు మేరకు ఆలయానికి ఐఎస్‌వో సర్టిఫికేషన్‌ అందించనున్నట్లు వెల్లడించా రు. ఐఎస్‌వో బృంద సభ్యులు ఆలపాటి శివయ్య, ఆలయ కార్యనిర్వహణాధికారి రామల సునీత, ఆలయ ప్రధానార్చకులు భద్రకాళి శేషు, విజయ్‌ కుమార్‌, ఆలయ సిబ్బంది హరినాథ్‌, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.