చారిత్రాత్మక రెవెన్యూ బిల్లుపై ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో చర్చ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఈ బిల్లును ప్రవేశపెట్టిన రోజే తాను సవివరంగా తెలిపాను. ఈ బిల్లుపై సభ్యులు సలహాలు, సూచనలు ఇస్తే బాగుంటుంది. ఏ ఉద్దేశంతో, ఏం ఆశించి ఈ బిల్లును తీసుకువచ్చామనేది సభ్యులు మాట్లాడిన తర్వాత సభకు వివరంగా చెప్తానని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఈ బిల్లుపై చర్చ ముగిసిన అనంతరం సభ ఆమోదించనుంది.
