కొత్త రెవెన్యూ చట్టంలో భాగంగా ప్రవేశపెడుతున్న ధరణి పోర్టల్ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. ప్రయివేటు అప్పజెప్పబోమని సీఎం తేల్చిచెప్పారు. రాష్ర్ట ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న టీఎస్‌టీఎస్ కార్పొరేషన్ ద్వారా ధరణి పోర్టల్‌ను నిర్వహిస్తామని సీఎం పేర్కొన్నారు. ధరణి పోర్టల్ గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అసవరం లేదన్నారు. భూ రికార్డుల విషయంలో ఎలాంటి అనుమానం అవసరం లేదు. భూ రికార్డులను మూడు రకాలుగా స్టోర్ చేస్తున్నామని తెలిపారు. ఈ-రికార్డు, డిజిటల్ రికార్డు, డాక్యుమెంట్ రూపంలో భూ రికార్డులు ఉంటాయని స్పష్టం చేశారు. ధరణి వెబ్‌సైట్ ఒకే సర్వర్ మీద ఆధారపడకుండా దేశంలో ఎక్కడ భద్రమైన ప్రాంతాలు ఉంటాయో అక్కడ సర్వర్లు ఉంటాయి. సర్వర్ల కోసం ఎంత ఖర్చు అయినా వెనుకాడబోమని సీఎం పేర్కొన్నారు. వ్యవసాయ భూములకు ఆకుపచ్చ పాస్‌బుక్, వ్యవసాయేతర భూములకు ముదురు ఎరుపు పాస్‌బుక్ ఇస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు.
