రేపు యాదాద్రికి సీఎం కేసీఆర్

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రాన్ని ఆదివారం ఉదయం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ ‌రావు సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో జరుగుతున్న ఆలయ అభివృధ్ధి పనులను వీక్షించనున్నారు. వాటి పురగోతిపై అధికారులతో సమీక్షించనున్నారు. కాగా ఆలయానికి వచ్చే భక్తులకు ఆధ్యాత్మికతో పాటు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దటం కోసం అన్ని రకాల సౌకర్యాలు, వసతులను కల్పిస్తున్నారు. ప్రధానంగా రాజుల కాలాన్ని తలపించే విధంగా శిల్పాలతో ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ప్రధానాలయ ముఖ మండపం, రాజ గోపుర నిర్మాణం, ఆలయ మాఢ వీధులతో పాటు అన్ని హంగులతో నిర్మిస్తున్నారు. ఈ పనుల పురోగతిపై సిఎం కెసిఆర్ పూర్తి స్థాయిలో సంబంధిత అధికారులతో సమీక్ష చేయనున్నారు.