రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించిన కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఎన్. సత్యనారాయణ తన సతిమని శ్రీమతి గంగాభవానితో కలిసి ఈ రోజు తన క్యాంప్ కార్యాలయంలో మూడు మొక్కలను నాటారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ఎన్. సత్యనారాయణ మాట్లాడుతూ గ్రీన్ ఛాలెంజ్ మంచి కార్యక్రమం అని ఇందుకు శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ని అభినందిస్తూ ఇందులో పాల్గొన్నందుకు నాకు సంతోషంగా ఉందన్నారు. అలాగే గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా ఇప్పటి వరకు కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో 400 మొక్కలు నాటడం జరిగిందని, గణతంత్ర దినోత్సవం లోపు 4 వేల మొక్కలను నాటుతామని తెలిపారు.
అలాగే మరో ముగ్గురిని మొక్కలు నాటాలని గ్రీన్ ఛాలెంజ్ విసిరారు 01) సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హన్మంతరావు, 02) జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎన్.శ్వేత, 03) జిల్లా స్పెషల్ ఆఫీసర్ వెంకటేశ్ ధోత్రే, 04) అసిస్టెంట్ కలెక్టర్ తేజర్ నందలాల్ పవార్ కి గ్రీన్ ఛాలెంజ్ విసిరారు.