పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. రోజువారీ సమీక్షలో భాగంగా దేశీయ చమురు కంపెనీలు పెట్రో ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్‌పై 13 పైసలు, డీజిల్‌పై 12 పైసల చొప్పున తగ్గాయి. ఈ నేపథ్యంలో లీటర్ పెట్రోల్ దర రూ.81.86గా, డీజిల్ ధర రూ.72.93గా ఉన్నాయి.
కాగా పెట్రోల్, డీజిల్‌పై రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కోవిధమైన పన్నులు వసూలు చేస్తున్నాయి. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉండనున్నాయి.