కరోనా సమయంలో సైబర్ క్రైం, మహిళలపై వేధింపులు ఎక్కువయ్యాయని సైబరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మహిళల భద్రత కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. సైబరాబాద్ కమిషనరేట్‌లో ఆయన ఈరోజు సేఫ్ యాప్‌ను ప్రారంభించారు. కొత్తగా ఉద్యోగంలో చేరే మహిళలకు ఈ యాప్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
మహిళలు పనిచేస్తున్న చోట్ల భద్రతకోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆత్మస్థైర్యాన్ని నింపే అంశాలను సేఫ్ ఈ-లెర్నింగ్ యాప్‌లో ఉంచామన్నారు. ఎస్సీఎస్సీ సహకారంతో ఇప్పటికే మార్గదర్శక్, సంఘమిత్రలను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. ఇప్పటివరకు 12 వందల మంది ప్లాస్మా దానం చేయగా, రెండు వేల మంది బాధితులను కాపాడామని వెల్లడించారు.