భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో భారీ ఎత్తున గంజాయి స్వాధీనం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ మొత్తంలో గంజాయి పట్టుబడింది. శుక్రవారం రాత్రి పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. ఈ క్రమంలో ట్రక్కులో తరలిస్తున్న ఈ గంజాయిని పట్టుకున్నట్టు పోలీసులు తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.2.12 కోట్లు ఉంటుందని వారు వెల్లడించారు. ఈ ఘటనలో హైదరాబాద్ కు చెందిన రాజు, పవార్, కర్నాటకు చెందిన పప్పుల నగేశ్, గన్నె రవి, మోత్రె ప్రకాశ్ లను అరెస్టు చేసినట్టు ఎఎస్ పి రాజేశ్ చంద్ర మీడియాకు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. నిషేధి గంజాయి, ఇత మాదక ద్రవ్యాలను, గుట్కా పాకెట్లను తరలించే వారి గురించి పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన ప్రజలను కోరారు.