తెలంగాణలో శుక్రవారం 62,234 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 2,278 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు శనివారం ఉదయం ఆయన బులెటిన్ విడుదల చేశారు. దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 1,54,880కి చేరింది. ఒక్కరోజే కరోనాతో 10 మంది మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 950కి చేరింది. కరోనా నుంచి తాజాగా 2,458 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,21,925కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 32,005 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో 25,050 మంది హోం లేదా ఇతరత్రా సంస్థల ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని ఆయన తెలిపారు.
