చినజీయర్‌ స్వామిని పరామర్శించిన ఏపీ సీఎం జగన్‌

శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్‌ స్వామిని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం ఫోన్‌ చేసి పరామర్శించారు. శనివారం చినజీయర్‌ స్వామి మాతృమూర్తి మంగతాయారు(85) అస్తమించారు. సీఎం వైఎస్‌ జగన్‌ స్వయంగా చినజీయర్‌ స్వామికి ఫోన్‌ చేసి ఆయన తల్లి మంగతాయారు మృతిపై సంతాపం వ్యక్తం చేస్తూ.. తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.