ఏపీలో కొత్తగా 9,536 కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో  కొత్తగా 9,536 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 5,67,123కు చేరింది.  ప్రస్తుతం 95,072 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటి వరకు 4,67,139 మంది కోలుకున్నారు. ఒక్క రోజు వ్యవధిలో 66 మంది మరణించారు.  కరోనా బారినపడి  మరణించిన వారి సంఖ్య 4,912కు పెరిగింది.  24 గంటల్లో 10,131 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు.