అమెరికాలోని ఓ జలపాతంలో పడి తెలుగు యువతి మృతి చెందింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా గుడెవల్లేరుకు చెందిన కమల అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసి ఉద్యోగం చేస్తుంది. ప్రస్తుతం కొలంబియాలో ఉంటూ బంధువుల ఇంటికి వెళ్లి తిరిగొస్తుండగా అట్లాంటా సమీపంలోని జలపాతం వద్ద సెల్ఫీ తీసుకుంటుండగా కాలు జారి నీళ్లలో పడిపోయింది. పర్యాటకుల సమాచారం మేరకు అమెరికా పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు. నాట్స్ సహకారంతో భారత్ కు మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కమల మృతితో ఆమె తల్లిదండ్రులు పొలవరపు లక్ష్మణరావు, అరుణ దంపతులు కన్నీరుమున్నీరవుతున్నారు. గుడెవల్లేరులో విషాదచాయలు అలుముకున్నాయి.