శ్రీత్రిదండి చినజీయర్‌ స్వామికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ‌ పరామర్శ

శ్రీత్రిదండి చినజీయర్‌ స్వామిని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఆదివారం హైదరాబాద్‌లో పరామర్శించారు. శుక్రవారం రాత్రి చినజీయర్‌ స్వామి మాతృమూర్తి అలిమేలుమంగ తాయారు పరమపదించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుబ్బారెడ్డి జీయర్‌ ఆశ్రమానికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు. ఆయన మాతృమూర్తి మరణంపై సంతాపం వ్యక్తం చేశారు.