ఏపీలో కొత్తగా 7,956 కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో ఆ రాష్ట్రంలో కొత్తగా 7,956 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 9,764 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి కాగా 60 మంది మృతి చెందారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 5,75,079 మంది కరోనా బారినపడగా ప్రస్తుతం 93,204 మంది వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. 4,76,903 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు.  తీవ్రమైన ఇన్‌ఫెక్షన్ల కారణంగా 4972 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో 61,529 మందికి కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించడగా ఇప్పటివరకు 46,61,355 పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు.