కేంద్ర ప్రతిపాదిత చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. బిల్లును ఉపసంహరించుకోవాలని సభలో సీఎం కేసీఆర్ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు మద్దతిచ్చాయి. అనంతరం కేంద్ర విద్యుత్ చట్టం బిల్లు ఉపసంహరణ తీర్మానానికి శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్ చట్టం 2003 సవరణ బిల్లును తెలంగాణ శాసనసభ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా, రాష్ర్టాల హక్కులను హరించే విధంగా, రైతులు, పేదల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఈ బిల్లు రూపకల్పన జరిగింది. దేశ ప్రజలపై ఈ చట్టాన్ని రుద్దవద్దని, కొత్త బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానిస్తున్నది.