తెలంగాణ‌, ఏపీ ఆర్టీసీ అధికారుల భేటీ

హైద‌రాబాద్ న‌గ‌రంలోని బ‌స్ భ‌వ‌న్‌లో తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల‌కు చెందిన ఆర్టీసీ అధికారులు స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా బ‌స్సు స‌ర్వీసుల‌పై రెండు రాష్ట్రాల ఆర్టీసీ ఎండీలు, ఈడీలు చ‌ర్చించారు. అంత‌ర్ రాష్ట్ర బ‌స్సు స‌ర్వీసుల పున‌రుద్ద‌ర‌ణ‌, కిలోమీట‌ర్ల‌పై చ‌ర్చించారు. ఏ రూట్ల‌లో ఎన్ని బ‌స్సులు న‌డ‌పాల‌నే అంశంపై కూడా ఓ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో అంత‌ర్ రాష్ట్రాల మ‌ధ్య ఆర్టీసీ బ‌స్సుల రాక‌పోక‌లు నిలిచిన విష‌యం విదిత‌మే.