హరితహరంలో మేడ్చల్‌ను అగ్రస్థానంలో నిలుపాలి : జిల్లా కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి హ రితహారం కార్యక్రమాన్ని మేడ్చల్‌ జిల్లాలో అగ్రగామిగా నిలుపాలని జిల్లా కలెక్టర్‌ వాసం వెంకటేశ్వ ర్లు కోరారు. హరితహారం కార్యక్రమంలో భాగం గా మంగళవారం పోచారం మున్సిపాలిటీ యం నంపేట్‌ గ్రామంలో 12మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మేడ్చల్‌ జిల్లా లో ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రజలు మొక్కలు నాటుతున్నారని చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం భవిషత్‌ తరాలకు మంచి వాతావరణాన్ని అందిస్తుందని కలెక్టర్‌ అభిప్రాయపడ్డారు. నాటిన మొక్కలు పెరిగేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలు చర్యలు తీసుకోవాలని సూచించా రు. చైర్మన్‌  కొండల్‌ రెడ్డి, వైస్‌ చైర్మన్‌ రెడ్యానాయ క్‌, కమిషనర్‌ రఘు, మేనేజర్‌ నర్సింహులు, కౌన్సిలర్లు ధనలక్ష్మి, రాజ్‌శేఖర్‌, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బాలేష్‌, శ్రీశైలం, పాల్గొన్నారు.