ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. గడచిన 24 గంటల్లో కొత్తగా 8835 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఒక్కరోజు వ్యవధిలోనే కరోనాతో మరో 64 మంది చనిపోయారు. రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 5,92,760కు చేరింది. ప్రస్తుతం 90,279 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు 4,97,376 మంది కోలుకున్నారు. ఏపీలో కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 5105కు పెరిగింది.