గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా

టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ శ్రీకారం చుట్టిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ దిగ్విజయంగా కొనసాగుతుంది. దేశ రాజధాని నగరంలో సైతం హరిత యజ్ఞం కొనసాగుతుంది. ఇప్పటికే పలువురు ఎంపీలు ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటారు. ఈ క్రమంలో లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగస్వామ్యమయ్యారు. ఓం బిర్లా నేడు పార్లమెంట్‌ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ ఎంపీలు సంతోష్‌కుమార్‌, కే.కేశవరావు, కొత్త ప్రభాకర్‌రెడ్డి, నామా నాగేశ్వరరావు పాల్గొన్నారు.