
తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి ఒకటి నుంచి మొదలు కానున్న ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటుచేయనున్నారు. ఈ విధానం గత ఏడాది నుంచే అమలులో ఉన్నా అప్పుడు కొన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు పనిచేయలేదు. ప్రాక్టికల్స్, థియరీ పరీక్షల నిర్వహణకు అవసరమైన ఫర్నీచర్ ఏర్పాటుకు కావాల్సిన నిధులను బోర్డు నుంచి నేరుగా ప్రిన్సిపాళ్లకే పంపిస్తున్నామని బోర్డు కార్యదర్శి తెలిపారు.