కరోనాతో మాదాపూర్‌ ఎస్‌ఐ మృతి

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రమాదకర స్థాయిలో విజృంభిస్తోంది. ఇప్పటికే వైరస్‌ బారినపడి వైద్యులు, పోలీసు అధికారులు చాలామంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా కరోనాసోకి మాదాపూర్‌ ఎస్‌ఐ అబ్బాస్‌ అలీ మృతిచెందారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న అలీకి ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ క్రమంలోనే  ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంపై రాష్ట్ర పోలీస్‌ శాఖ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.