ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతున్నది. గడచిన 24 గంటల్లో కొత్తగా 8,096 పాజిటివ్ కేసులు నమోదు కాగా 67 మంది మరణించారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,09,558కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 84,423 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు 5,19,891 మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 5,244కు పెరిగింది. గడచిన 24 గంటల్లో 11,803 మంది కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇవాళ్టి వరకు రాష్ట్రంలో 49,59,081 శాంపిల్స్ పరీక్షించారు
