తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ వైభవంగా జరిగింది. ముక్కోటి దేవతలు, భక్తకోటిని బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ శుక్రవారం సాయంత్రం అంకురార్పణ నిర్వహించారు. శనివారం సాయంత్రం మీన లగ్నంలో ధ్వజారోహణం నిర్వహించనున్నారు. కార్యక్రమంలో టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తదితరులు పాల్గొన్నారు.
