బండ్లగూడ జాగీర్ పరిధిలో టీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేయాలని ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ సూచించారు. సోమవారం బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ అధ్యక్షుడిగా సురేశ్‌గౌడ్, యూత్ అధ్యక్షుడిగా ఎక్కల్‌దేవ్ మల్లేశ్‌యాదవ్‌ను నియమిస్తూ నియామక పత్రాలను అందజేశారు. బండ్లగూడ జాగీర్ మేయర్ మహేందర్‌గౌడ్, నార్సింగి మున్సిపల్ చైర్పర్సన్ రేఖ యాదగిరి, డిప్యూటీ మేయర్ పూలపల్లి రాజేందర్‌రెడ్డి, డిప్యూటీ చైర్మన్ వెంకటేశ్ యాదవ్, రాందాస్, గండిపేట మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు రామేశ్వరం నర్సింహ, మాజీ ఎంపీపీ తలారి మల్లేశ్, నాయకులు ప్రేమ్‌గౌడ్, చంద్రశేఖర్‌రెడ్డి, నాగరాజు, సురేశ్‌గౌడ్, విష్ణువర్ధన్‌రెడ్డి, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.
