ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. మధ్యాహ్నం గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరిన ఆయన.. నాలుగు గంటల సమయంలో ఢిల్లీకి చేరారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సహా.. పలువురు కేంద్రమంత్రులను సీఎం కలవనున్నారు. ఏపీ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను చర్చించనున్నారు. పోలవరం ప్రాజెక్ట్‌కు నిధులు, తాజా పరిస్థితులపై చర్చించనున్నట్లు తెలిసింది. ఏపీ అభివృద్ధి అజెండాగా సీఎం జగన్ ఢిల్లీ పర్యటన సాగుతుంది.
