పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు త్వరగా పూర్తిచేయాలి : కలెక్టర్‌ అనితారామచంద్రన్

పల్లె ప్రకృతి వనాల ఏర్పాటును త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ అన్నారు. తుర్కపల్లి, చోక్లాతండాలోని పల్లె ప్రకృతి వనాలతో పాటు మండల కేంద్రంలోని డబుల్‌బెడ్‌రూం ఇండ్లు, రైతు వేదిక నిర్మాణ స్థలాన్ని మంగళవారం ఆమె పరిశీలించారు. పల్లె ప్రకృతి వనాల స్థలాల్లో మొక్కలు నాటారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుతో గ్రామాల్లో పచ్చదనం పెంపొందుతుందన్నారు. డబుల్‌బెడ్‌రూం ఇండ్లను పరిశీలించి త్వరగా తాగునీరు, విద్యుత్‌ సౌకర్యం కల్పించాలన్నారు. ఆమె వెంట ఎంపీడీవో ఉమాదేవి, తహసీల్దార్‌ సలీముద్దీన్‌, ఎంపీవో శ్రీమాలిని, సర్పంచ్‌లు వనిత, బాబునాయక్‌ ఉన్నారు.