తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 2296 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయని తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,77,070 చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 29,873 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజాగా 2062 మంది మహమ్మారి నుంచి కోలుకొని డిశ్చార్జి కాగా.. మొత్తం 1,46,135 మంది బాధితులు ఇండ్లకు వెళ్లారు. వైరస్ ప్రభావంతో కొత్తగా 10 మంది మృత్యువాతపడగా.. ఇప్పటికీ 1062 మంది మరణించారు. రాష్ట్రంలో కొవిడ్ మరణాల రేటు 0.59శాతం ఉందని, రికవరీ రేటు 82.52శాతంగా ఉందని వైద్యశాఖ తెలిపింది.
మరో 23,527 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు చెప్పింది. మంగళవారం ఒకే రోజు 55,892 టెస్టులు చేయగా.. మొత్తం 26,28,897 శాంపిల్స్ పరీక్షించినట్లు పేర్కొంది. తాజాగా నమోదైన కేసుల్లో హైదరాబాద్ జీహెచ్‌ఎంసీలో 321 అత్యధికంగా ఉండగా.. రంగారెడ్డిలో జిల్లాలో 271, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 173, నల్గొండలో 155, కరీంనగర్‌లో 136, వరంగల్ అర్బన్ జిల్లాలో 99, సిద్దిపేటలో 92, నిజామాబాద్‌లో 82, సంగారెడ్డిలో 81 కేసులు రికార్డయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ వివరించింది.