కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదలడం లేదు. సామాన్యుల నుంచి ప్రజాప్రతినిధులు, అధికారుల వరకు వైరస్ బారినపడి విలవిలలాడుతున్నారు. గురువారం బీజేపీ నాయకుడు, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన ప్రభుత్వ నేచర్ క్యూర్ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. గత వారం రోజులుగా తనను కలిసేందుకు వచ్చిన వారు కరోనా పరీక్ష పరీక్ష చేయించుకొని హోం క్వారంటైన్లో ఉండాలని ఆయన కోరారు.