ఎస్పీ బాలు మృతి ప‌ట్ల రాష్ట్రప‌తి, ప్ర‌ధాని సంతాపం

 గాన గంధ‌ర్వుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మణ్యం మృతిప‌ట్ల రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్‌, ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ సంతాపం తెలిపారు. బాలు కుటుంబ స‌భ్యుల‌కు, అభిమానుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు.

భార‌త సంగీతం ఓ గొప్ప స్వ‌రాన్ని కోల్పోయింది అని రాష్ట్రప‌తి అన్నారు. పాట‌ల చంద్రుడిగా ఎస్పీ బాలు అనేక పుర‌స్కారాలు అందుకున్నార‌ని కోవింద్ పేర్కొన్నారు.