ఏపీలో కొత్తగా 7,073 కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో  కొత్తగా 7,073 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిందని ఏపీ వైద్యారోగ్యశాఖ తెలిపింది.  ఏపీలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య  6,61,458కు పెరిగింది.  ప్రస్తుతం 67,683 యాక్టివ్‌ కేసులున్నాయి.  ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకొని 5,88,169  మంది డిశ్చార్జ్‌ అయ్యారు.  రాష్ట్రంలో కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 5,606కు చేరింది.  ఇవాళ్టి వరకు ఏపీలో 54,47,796 శాంపిల్స్‌ పరీక్షించారు. 24 గంటల్లో 8,695 మంది కొవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకున్నారు.