కరోనా లాక్‌డౌన్ కారణంగా మూసివేయబడ్డ శిల్పారామం (మాదాపూర్) అక్టోబర్ 2వ తేదీన తెరుచుకోనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు శిల్పారామం తెరిచి ఉండనుంది. పర్యాటకులకు థర్మల్ స్ర్కీనింగ్ చేసిన తర్వాతే లోపలికి అనుమతించనున్నారు. ప్రవేశ ద్వారం వద్ద పర్యాటకులు కచ్చితంగా చేతులను శానిటైజ్ చేసుకోవాలి.
కేంద్ర మార్గదర్శకాల మేరకు శనివారం నుంచి అర్బన్ పార్కులను తెరిచేందుకు ప్రభుత్వం అనుమతిచ్చిన విషయం విదితమే. కరోనా నిబంధనలను అనుసరించి సందర్శకులకు శానిటైజర్లను అందుబాటులో ఉంచాలని, మాస్కులు ధరించిన వారినే లోపలకు అనుమతించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. వచ్చే నెల 6వ తేదీ నుంచి హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్కు సందర్శకులకు అందుబాటులోకి రానుంది.