ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 7,293 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ తెలిపింది. గడచిన 24 గంటల్లో కరోనా కారణంగా మరో 57 మంది చనిపోయారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,68,751కు చేరింది. శనివారం వరకు 5,97,294 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు కరోనా బారినపడి 5,663 మంది మరణించారు. 24 గంటల్లో 9,125 మంది పూర్తిగా కోలుకున్నారు. ఇవాళ్టి వరకు రాష్ట్రంలో 55,23,786 శాంపిల్స్ పరీక్షించారు.
