మాజీ హోంమంత్రి నాయినికి సీఎం కేసీఆర్ ప‌రామ‌ర్శ‌

మాజీ హోంమంత్రి నాయిని న‌ర్సింహారెడ్డిని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప‌రామ‌ర్శించారు. జూబ్లీహిల్స్ అపోలో ఆస్ప‌త్రికి సీఎం కేసీఆర్ బుధ‌వారం సాయంత్రం వెళ్లారు. అక్క‌డ నాయినిని ప‌రామ‌ర్శించిన అనంత‌రం ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితిపై వైద్యుల‌ను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాల‌ని వైద్యుల‌ను కేసీఆర్ కోరారు. నాయిని కుటుంబ స‌భ్యుల‌కు సీఎం కేసీఆర్ ధైర్యం చెప్పారు. 

గత నెల 28న కరోనా బారినపడిన నాయిని.. బంజారాహిల్స్‌లోని ఓ దవాఖానలో 16 రోజులపాటు చికిత్స పొందారు. ఇటీవ‌ల‌ నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చింది. ఒక్కసారిగా ఊపిరి తీసుకోవడం కష్టంగా మారడంతో పరీక్షించిన వైద్యులు ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ సోకినట్టు గుర్తించారు. ఆక్సిజన్‌ పడిపోవడంతో ఈ నెల 13న‌ దవాఖానకు తరలించారు. అప్పటినుంచి ఆయనకు వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.