గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్క‌లు నాటిన లావ‌ణ్య‌

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్  భాగంగా ఉప్పల్ లో మొక్కలు నాటారు ఆర్టిస్ట్ లావణ్య రెడ్డి. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నా వంతుగా మొక్కలు నాటడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని ఆర్టిస్ట్ లావణ్య రెడ్డి తెలిపారు.గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా దేశ వ్యాప్తంగా పచ్చని వనంలాగా తీర్చిదిద్ధేందుకు  కృషి చేస్తున్న రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలియ‌జేసింది.  ఆర్టిస్ట్ సింధూర విసిరిన గ్రీన్ ఛాలెంజ్ స్వీకరిస్తూ ఉప్పల్ లోని విజయపూరి కాలనీ తన నివాసంలో మొక్కలు నాటిన  సినీ ఆర్టిస్ట్ లావణ్య రెడ్డి…అనంతరం మరో ముగ్గురు ( కొరియోగ్రాఫర్ ఆట సందీప్ , నటి & డాన్సర్ ఆట జ్యోతి , డైరెక్టర్ యోగి ) ని కూడా మొక్కలు నాటి మరో ముగ్గురికి ఈ ఛాలెంజ్ విసరాలని కోరారు.