గ్రేటర్‌లో 2226 నామినేషన్లు దాఖలు

గ్రేటర్‌ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. ఈ నెల 18 నుంచి నామినేషన్లు ప్రారంభమైంది. చివరి రోజైన శుక్రవారం నాటికి మొత్తం 150 వార్డులకుగాను 1,633 మంది అభ్యర్థులు 2,226 నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో బీజేపీ-494, సీపీఐ-15, సీపీఎం-24,కాంగ్రెస్‌-312, మజ్లిస్‌-66, టీఆర్‌ఎస్‌- 493, టీడీపీ-186, గుర్తింపు పొందిన ఇతర పార్టీలు- 86, స్వతంత్రుల నుంచి 550నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజైన శుక్రవారం పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. ఆదివారం సాయంత్రం మూడు గంటల వరకు ఉపసంహరణలకు గడువు ఉంటుంది. అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను వెల్లడిస్తారు.