ఇటీవల మృతిచెందిన నాగార్జున సాగర్ టీఆర్‌ఎస్ శాసనసభ్యులు నోముల నర్సింహయ్య కుటుంబాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, మాజీ ఎంపీ మధుయాష్కీ పరామర్శించారు. ఛాతినొప్పి అని చెప్పడంతో నోముల నర్సింహయ్యను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఈ నెల 1వ తేదీన నగరంలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. హైదర్‌గూడ అపోలో ఆస్పత్రికి తెల్లవారుజామున 5.30కి తీసుకురాగా అప్పటికే మృతిచెందినట్లుగా వైద్యులు తెలిపారు.