హెచ్‌ఎండీఏ కార్యాలయంలో ఏసీబీ అధికారుల సోదాలు.. భారీగా న‌గ‌దు ల‌భ్యం

నానక్‌రామ్‌గూడ హెచ్‌ఎండీఏ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ సందర్భంగా హెచ్‌ఎండీఏ అర్బన్‌ ఫారెస్టు డెవలప్‌మెంట్‌ విభాగం డీఎఫ్‌వో ప్రకాశ్‌ వద్ద అధికారులు రూ. 10.30 లక్షలను గుర్తించారు. దీంతో డీఎఫ్‌వో ప్రకాశ్‌కు చెందిన దూలపల్లిలోని ఇంట్లోనూ అవినీతి నిరోధకశాఖ అధికారులు సోదాలు చేపట్టారు. డీఎఫ్‌వో ప్రకాశ్‌ గుత్తేదారుల నుంచి లంచం తీసుకున్నట్లు ఫిర్యాదులు అందడంతో ఏసీబీ రైడ్‌ చేసింది. డీఎస్పీ సూర్యానారాయణ ఆధ్వర్యంలో ఏసీబీ బృందం విచారణ చేపట్టింది.