తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణితో పాటు మరో ముగ్గురు సభ్యులు విఠల్, చంద్రావతి, మహ్మద్ మథీనుద్దీన్ ఖాద్రీ పదవీకాలం ఈ నెల 17వ తేదీతో ముగియనున్నది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. రాజ్యాంగం ప్రకారం టీఎస్పీఎస్సీ చైర్మన్‌తో పాటు సభ్యుల పదవీకాలం ఆరేండ్లు ఉంటుంది. 2014 డిసెంబర్ 17న వీరిని నియమించారు.