శ్రీవారి సేవలో ఎంపీ జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ఎంపీ జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ బుధవారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు తీర్చుకున్నారు. ఎంపీ సంతోష్‌ కుమార్‌తోపాటు ఎమ్మెల్సీలు శ్రీనివాస్‌రెడ్డి, నవీన్‌కుమార్‌ శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ పరిసరాల్లో మొక్కలు నాటారు. అంతకుమందు ఎంపీ సంతోష్‌ కమార్‌కు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆలయం వద్ద స్వాగతం పలికారు.