నాగార్జున ప్రభుత్వడిగ్రీ కళాశాల(ఎన్జీ) అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి తెలిపారు. ఎన్జీ కళాశాలలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కళాశాలలో 30 అదనపు గదుల నిర్మాణ పనులకు ఈనెల 21 న శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు. ముఖ్య అతిథిగా విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి హాజరుకానున్నట్లు వెల్లడించారు. అంతకు ముందు కళాశాలలో ఏర్పాట్లను పరిశీలించారు సమావేశంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ సుంకరి మల్లేశ్ గౌడ్, కౌన్సిలర్ ఖయ్యూంబేగ్, బీఆర్ఏఓయూ ఉమ్మడి జిల్లా డిప్యూటీ డైరెక్టర్ బి.ధర్మానాయక్, ప్రిన్సిపాల్ రహత్ఖానమ్ పూర్వ విద్యార్థులు డా. నరేందర్‌రెడ్డి, లింగయ్య, గోనారెడ్డి పాల్గొన్నారు.