రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఎంపీ సంతోష్ కుమార్ పిలుపుమేరకు ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ మొక్కలు నాటారు. గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించి గచ్చిబౌలిలోని కేజీఎఫ్ 2 షూటింగ్ జరుగుతున్న ప్రదేశంలో 8 మొక్కలు నాటినట్టు సంజయ్ దత్ తెలిపారు . అనంతరం తన అభిమానులను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు నామినేట్ చేశారు. అభిమానులు ప్రతీ ఒక్కరూ 3 మొక్కలు నాటి.. గ్రీన్ ఛాలెంజ్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని కొనసాగించాలని సంజయ్ దత్ విజ్ఞప్తి చేశారు.
ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న కేజీఎఫ్ చాఫ్టర్ 2లో అధీరా పాత్రలో నటిస్తున్నాడు సంజయ్ దత్. ఇప్పటికే అధీరా లుక్ పై ప్రేక్షకుల నుంచి అద్బుతమైన స్పందన వచ్చింది.