గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న నూతన దంపతులు

అప్పుడే పెళ్లైన కొత్త జంట గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్క నాటింది. గురువారం కరీంనగర్‌ పట్టణంలోని పద్మనాయక ఫంక్షన్‌ హాల్‌లో ఎనుముల విజయ్‌-మహిత వివాహం జరిగింది. వివాహమైన కొన్ని నిమిషాల‌కే కొత్త జంట గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొంది. కరీంనగర్‌ మేయర్‌ వై సునీల్‌ రావు సమక్షంలో ఫంక్షన్‌హాల్‌ పరిసరాల్లో సంతోష్‌ రావు పేరుతో నూతన దంపతులు మొక్క నాటారు. పర్యావరణ పరిరక్షణకు పెద్ద ఎత్తున మొక్కలు నాటాల్సిందిగా మేయర్‌ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మొక్కలు నాటుతూ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌‌ను విజయవంతం చేయాల్సిందిగా కోరారు.