పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా కేంద్రప్రభుత్వం శుక్రవారం 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ. 2వేల చొప్పున జమచేయనున్నది. అందుకు అవసరమైన రూ. 18వేల కోట్లను ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మోదీ 6 రాష్ర్టాలకు చెందిన రైతులతో ముచ్చటిస్తారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద కేంద్రం ఏడాదికి రూ. 6వేల చొప్పున ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆర్థిక సాయాన్ని ఒకేసారి కాకుండా ఏడాదిలో మూడు విడుతల్లో ఇస్తున్నారు.