క్రిస్మన్‌ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఏపీ సీఎం జగన్‌

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పులివెందులలోని సీఎస్‌ఐ చర్చిలో క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనల్లో  పాల్గొన్నారు. అలాగే సీఎం సతీమణి వైఎస్‌ భారతి, వైఎస్సార్‌ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ కూడా ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు.  ప్రార్థనల అనంతరం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ…‘క్రిస్మస్‌ తో పాటు వైకుంఠ ఏకాదశి కలిసి రావడం శుభదినం. ఇవాళ 30లక్షలకు పైగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నాం.