కిసాన్ స‌మ్మాన్ నిధి కింద రైతుల ఖాతాల్లోకి 18వేల కోట్లు రిలీజ్ చేసిన ప్ర‌ధాని

కిసాన్ స‌మ్మాన్ నిధి కింద రైతుల ఖాతాల్లోకి 18 వేల కోట్లు రిలీజ్ అయ్యాయి.  ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఇవాళ జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో ఆ మొత్తాన్ని రిలీజ్ చేశారు.  సుమారు 9 కోట్ల మంది రైతుల‌కు ఈ నిధి అంద‌నున్న‌ది.  తెలంగాణ ప్ర‌భుత్వం ఇస్తున్న రైతు బంధు త‌ర‌హాలోనే కేంద్ర ప్ర‌భుత్వం కిసాన్ స‌మ్మాన్ నిధి ఇస్తున్న విష‌యం తెలిసిందే.  కిసాన్ నిధి స్కీమ్ కింద రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా ఎక‌రానికి రెండు వేల రూపాయాలు జ‌మ అవుతాయి. కిసాన్ క్రెడిట్ కార్డును కూడా రైతులు వాడుకోవాల‌ని ప్ర‌ధాని మోదీ ఈ సంద‌ర్భంగా తెలియ‌జేశారు. 18 వేల కోట్ల అమౌంట్‌ను రిలీజ్ చేసిన త‌ర్వాత మోదీ.. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ రైతుల‌తో మాట్లాడారు. మొత్తం ఆరు రాష్ట్రాల రైతుల‌తో ఆయ‌న వీడియోకాన్ప‌రెన్స్ ద్వారా మాట్లాడారు.